1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్పు హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరు యూదైయ సమరైయ దేశములయందు చెదరిపోయిరి.
2 భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిగూర్చి బహుగా ప్రలాపించిరి.
3 సౌలయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.
4 కాబట్టి చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.
5 అప్పుడు ఫిలిప్పు సమరైయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను.
6 జనసమూహములు విని ఫిలిప్పుచేసిన సూచకక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా
7 అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువుగలవారును కుంటివారును అనేకులు స్వస్థతపొందిరి.
8 అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.
9 సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెనవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరైయ జనులను విభ్రాంతి పరచుచుండెను.
10 కొద్దివాడు మొదలుకొని గొప్పవానిమట్టుకు అందరు - దేవుని మహాశక్తి యనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి.
11 అతడు బహుకాలము గారడీలుచేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి.
12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసు క్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.
13 అప్పుడు సీమోనుకూడ నమ్మి బాప్తిస్మముపొంది, ఫిలిప్పును ఎడబాయకుండి, సూచకక్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతినొందెను.
14 సమరైయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.
15 వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి.
16 అంతకుముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందినవారై యుండిరి.
17 అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.
18 అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి
19 వారియెదుట ద్రవ్యము పెట్టి - నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.
20 అందుకు పేతురు - నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడ నశించుగాక.
21 నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.
22 కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;
23 నీవు ఘోరదుష్టత్వములోనుదుర్ణీతిబంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.
24 అందుకు సీమోను - మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.
25 అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యముబోధించి యెరూషలేముకు తిరిగి వెళ్లుచు, సమరైయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.
26 ప్రభువు దూత - నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేమునుండి గాజాకుపోవు అరణ్యమార్గమును కలిసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.
27 అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటిమీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చియుండెను.
28 అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.
29 అప్పుడు ఆత్మ - నీవు ఆ రథము దగ్గరకు పోయిదాని కలిసికొనుమని చెప్పెను.
30 ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని - నీవు చుదువునది గ్రహించుచున్నావా అని అడుగగా
31 అతడు - నాకెవడైనను త్రోవచూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను.
32 అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగాఆయన గొర్రెవలె వధకు తేబడెనుబొచ్చు కత్తిరించువాని యెదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.
33 ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెనుఆయన సంతానము ఎవరు వివరింతురు?ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.
34 అప్పుడు నపుంసకుడు - ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.
35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
36-38. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్నయొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు - ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. 2ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను.
39 వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.
40 అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరైయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.
Download Audio File

No comments:
Post a Comment