1 అంతియొకైయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ, చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.
2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ - నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.
3 అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
4 కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూకియకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.
5 వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడైయుండెను.
6 వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.
7 ఇతడు వివేకముగలవాడైన సెర్గియ పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
8 అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరుకు గారడీవాడని అర్థము.
9 అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై
10 అతని తేరి చూచి - సమస్తకపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాదికుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
11 ఇదిగో ప్రభువు తన చెయ్యినీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యిని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యి పట్టుకొని నడిపంతురా అని వెదకుచుండెను.
12 అంతట ఆ అధిపతి జరిగినదాని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.
13 తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ ఎక్కి పాపునుండి బయలుదేరి పంపులియలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లెను.
14 అప్పుడు వారు పెర్గేనుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకైయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి కూర్చుండిరి.
15 ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు - సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.
16 అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను -
17 ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరవాసులైయున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొని వచ్చి
18 యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.
19 మరియు కనాను దేశములో ఏడు జాతులవారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.
20 ఇంచుమించు నన్నూట ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను.
21 ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల పర్యంతము దయచేసెను.
22 తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన - నేను యెష్షయి కుమారుడైన దావీదు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని కనుగొంటినని చెప్పి అతనిగూర్చి సాక్ష్యమిచ్చెను.
23 అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.
24 ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.
25 యోహాను తన పనిని నెరవేర్చుచుండగా - నేనెవడనని మీరు ఊహించుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైన నేను పాత్రుడను కానని చెప్పెను.
26 సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.
27 యెరూషలేములో కాపురముండువారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్ష విధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.
28 ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.
29 వారు ఆయననుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.
30 అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
31 ఆయన గలిలైయనుండి యెరూషలేముకు తనతోకూడ వచ్చిన వారికి అనేక దినములు కనబడెను; వారిప్పుడు ప్రజలయొదుట ఆయనకు సాక్షులైయున్నారు.
32-33. దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే -నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటినిఅని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది. 2
34 మరియు ఇకను కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటనుబట్టి - దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.
35 కాబట్టి వేరొక కీర్తనయందు3- నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవని చెప్పుచున్నాడు.
36-37. దావీదు దేవుని సంకల్పముచొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి తన పితరులయొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.
38 కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
39 మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక.
40 ప్రవక్తల గ్రంథమందు1చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా
41 - ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడినశించుడిమీ దినములలో నేనొక కార్యము చేసెదనుఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంతమాత్రమును నమ్మరు.
42 వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.
43 సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.
44 మరుసటి విశ్రాంతిదినము దాదాపుగ ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.
45 యూదులు జనుసమూహములను చూచి మత్సరముతో నిండకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.
46 అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి - దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే; అయినను మీరు దాని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము;
47 ఏలయనగా - నీవు భూదింగతములవరకు రక్షణార్థముగా ఉండునట్లునిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నానుఅని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. 2
48 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
49-50. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందతట వ్యాపించెను గాని యూదుల భక్తిమర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.
51 వీరు తమ పాద ధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.
52 అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.
Download Audio File

No comments:
Post a Comment