Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

22వ అధ్యాయము

1  సహోదరులారా తండ్రులారా, నేనిప్పుడు మీయెదుట చెప్పు సమాధానము నాలకించుడి. 
2  అతడు హెబ్రీభాషలో మాటలాడుట వారు విని మరి నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను 
3  - నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవునిగూర్చి ఆసక్తుడనై యుండి 
4  ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణపర్యంతమును హింసించితిని. 
5  ఇందునుగూర్చి ప్రధానయాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు, నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోనివారినికూడ బంధించి దండించుటకై యెరూషలేముకు తేవలెనని అక్కడికి వెళ్లితిని. 
6  నేను ప్రయాణముచేయుచు దమస్కుకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను. 
7  నేను నేలపడి - సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక శబ్దము పలుకుట వింటిని. 
8  అందుకు నేను - ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన - నేను నీవు హింసించుచున్న నజరేయుడవగు యేసును అని నాతో చెప్పెను. 
9  నాతోకూడ నున్నవారు ఆ వెలుగు చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు. 
10  అప్పుడు నేను - ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా ప్రభువు - నీవు లేచి దమస్కులోకి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను. 
11  ఆ వెలుగుయొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోకి వచ్చితిని. 
12  అంతట ధర్మశాస్త్రముచొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి 
13  - సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని. 
14  అప్పుడతడు - మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు; 
15  నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు 
16  గనుక నీవు తడవుచేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మముపొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను. 
17  అంతట నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థనచేయుయుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. 
18  అప్పుడాయన -నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను. 
19  అందుకు నేను - ప్రభువా, ప్రతి సమాజమందిరములో నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచునుంటినని వారికి బాగుగా తెలియును. 
20  మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేనుకూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని. 
21  అందుకు ఆయన - వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. 
22  ఈ మాటవరకు వారతడు చెప్పినది ఆలకించుచుండిరి. పిమ్మట - ఇటువంటివాడు బ్రదుకదగడు, భూమి మీద ఉండకుండ వాని చంపివేయుడని కేకలువేసిరి. 
23  వారు కేకలువేయుచు తమ బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా 
24  వారతనికి విరోధముగా ఈలాగు కేకలువేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతని కొట్ట విమర్శమంపవలెనని చెప్పి, కోటలోకి తీసికొని పొండని ఆజ్ఞాపించెను. 
25  వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తనదగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి - శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధకారమున్నదా అని యడిగెను. 
26  శతాధపతి ఆ మాట విని సహస్రాధిపతియొద్దకు వచ్చి - నీవేమిచేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను. 
27  అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతని చూచి - నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా 
28  అతడు - అవునని చెప్పెను. సహస్రాధిపతి - నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలు - నేనైతో పుట్టుకతోనే రోమీయుడననెను. 
29  కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను. 
30  మరునాడు, యూదులతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని నదిలించి, ప్రధానయాజకులును మహా సభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసికొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను. 
Download Audio File

No comments:

Post a Comment