1 వారు అంపిపొలి అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్లి థెస్సలొనీకేకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను
2-3. గనుక పౌలు తన వాడుకచొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి - క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట అవశ్యమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పిచెప్పుచు, వారితో మూడు విశ్రాంతిదినములుతర్కించుచుండెను.
4 వారిలో కొందరును, భక్తిపరులగు హెల్లేనీయులలో చాలమందియు, స్థితిగలస్త్రీలలో అనేకులును (ఆ మాటలకు) ఒప్పుకొన పౌలుతోను సీలతోను కలిసికొనిరి.
5 అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు, యూసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.
6 అయితే వారు కనబడనందున యాసోనును కొందురు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి -భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడి వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు.
7 వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.
8 జనసమూహమును పట్టణపు అధికారులును ఈ మాటలు విని కలవరపడిరి.
9 వారు యాసోనునొద్దను కడమవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదలచేసిరి.
10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరైయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.
11 వీరు థెస్సలొనీకేలో ఉన్నవారికంటె యోగ్యులైయుండిరి గనుక సంపూర్ణ సిద్ధమనస్సుతో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు పరిశోధించుచు వచ్చిరి.
12 అందుచేత వారిలో అనేకులును, ఘనతగల హెల్లేనీయ స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.
13 అయితే బెరైయలో కూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకేలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.
14 వెంటనే సహోదరులు పౌలును సముద్రము దనుక వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమొథెయును అక్కడనే నిలిచిపోయిరి.
15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని అతేనైపట్టణమువరకు తోడుకొని వచ్చి, సీలయు తిమొథెయును సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు వావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
16 పౌలు అతేనైలో వారికొరకు కనిపెట్టకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
17 కాబట్ట సమాజమందిరములో యూదులతోను భక్తిపరులైనవారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొనువారితోను తర్కించుచు వచ్చెను.
18 ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్నకొందరు తత్వజ్ఞులు అతనితో వాదించిరి. కొందరు - ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునరుత్థానమునుగూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు - వీడు అపూర్వమైన దేవతలనుప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
19 అంతట వారు అతని వెంటబెట్టుకొని అరెయొపాగు అను సభయొద్దకు తీసికొనిపోయి - నీవు చేయుచున్న యీ నూతనబోధ యెట్టిదో మేము తెలిసికొన వచ్చునా?
20 కొన్ని అపూర్వమైన సంగతులు మాచెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొనగోరుచున్నామని చెప్పిరి.
21 అతేనైయులందరును అక్కడ నివసించు పరదేశస్థులును ఏదో యొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు.
22 పౌలు అరెయొపాగు మధ్య నిలిచి చెప్పిన దేమనగా - అతేనైయులారా, మీరు సమస్త విషయములలో అతిదేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది.
23 నేను సంచరించుచు మీ దేవతాప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దానిమీద - తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
24 జగత్తును అందులోని సమస్తమును నిర్మంచిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యల చేతులతో సేవింపబడువాడు కాడు.
26-27. మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో యని తన్ను వెదుకునిమిత్తము నిర్ణయకాలములను వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
28 మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె - మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
29 కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు.
30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యలకు ఆజ్ఞాపించుచున్నాడు.
31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండ ఆయనను లేపినందున దీని నమ్మటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
32 మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరు - దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
33 ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.
34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరెయొపాగీతుడైన దియొనుసియు, దామరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరు నుండిరి.
Download Audio File

No comments:
Post a Comment