Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

1వ అధ్యాయము

1-2. ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. 
3  ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల పర్యంతము వారికగుపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. 
4  ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను - మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; 
5  యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్దిదినములలోగా మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మముపొందెదరనెను. 
6  కాబట్టి వారు కూడివచ్చినప్పుడు - ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన 
7  - కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. 
8  అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదైయ సమరైయ దేశములయందంతటను భూదిగంతములవరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. 
9  ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను; అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండ ఆయనను కొనిపోయెను. 
10  ఆయన వెళ్లుచుండగా వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని వస్త్రములు ధించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి 
11  - గలిలైయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే యే రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 
12  అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేముకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది. 
13  వారు (పట్టణములో) ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమానియను సీమోను, యాకోబు కుమారుడగుయూదా అనువారు. 
14  వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును, ఏకభావముగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 
15  ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి యిట్లనెను 
16  - సహోదరులారా, యేసును పట్టుకొనినవారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. 
17  అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను. 
18  ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటకి వచ్చెను. 
19  ఈ సంగతి యెరూషలేములో కాపురమున్నవారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా 
20  - అతని యిల్లు పాడైపోవుగాకదానిలో ఎవడును కాపురముండక పోవుగాకఅతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాకఅని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది
21-22. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మనమధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట అవశ్యమని చెప్పెను. 
23  అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి 
24  ఇట్లని ప్రార్థనచేసిరి - అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, 
25  తనచోటికి పోవుటకు యూదాతప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనుపరచుమనిరి. 
26  అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటివచ్చెను గనుక అతడు పదకొండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను. 
Download Audio File

2వ అధ్యాయము

1  పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. 
2  అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి ఆకస్మాత్తుగా కలిగి, వారు కూర్చుండియున్న యిల్లంతయు వ్యాపించెను. 
3  మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొకనిమీద వ్రాలగా 
4  అందరు పరిశద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ఛక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. 
5  ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. 
6  ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. 
7  అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి - ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలైయులు కారా? 
8  మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? 
9  పార్తేయులు మాదీయులు ఏలామీయులు మెసొపొతమియు యూదైయ కపదొకియ పొంతు ఆసియ ప్రుగియ పంపులియ ఐగుప్తు అను దేశములయందలివారు, 
10  కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చియున్న యూదులు, యూదమత ప్రవిష్టులు, 
11  క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. 
12  అందరు విభ్రాంతినొంది యెటుతోచక ఇదేమగునో అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
13  కొందరైతే - వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. 
14  అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను - యూదైయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులార, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. 
15  మీరు ఊహించునట్టు వీరు మత్తులుకారు, ప్రొద్దుపొడిచి జామయిన కాలేదు. 
16  యోవేలు ప్రవక్తద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా 
17  - అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమమారైలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు, 
18  ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్లమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవంచించెదరు 
19  పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. 
20  ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగను చంద్రుడు రక్తముగాను మారుదురు, 
21  అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయువారందరును రక్షణపొందుదురు1 అని దేవుడు చెప్పుచున్నాడు. 
22  ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనుపరచెను; ఇది మీరే యెరుగుదురు. 
23  దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేతసిలువవేయించి చంపితిరి. 
24  మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు నివారణచేసి ఆయనను లేపెను 
25  ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను- నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నాకుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. 
26  కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. 
27  నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. 
28  నాకు జీవమార్గములు తెలిపితివి నీదర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. 3
29  సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను; అతని గోరీనేటివరకు మనమధ్య ఉన్నది. 
30  అతడు ప్రవక్తయై యుండెను గనుక - అతని గర్భఫలములోనుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అనిదేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి 
31  క్రీస్తుపాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను. 
32  ఈ యేసును దేవుడు లేపెను; దీనికిమేమందరము సాక్షులము. 
33  కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీని కుమ్మరించియున్నాడు. 
34  దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు; అయితే అతడిట్లనెను - 
35  నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచుపర్యంతము నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. 4
36  మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. 
37  వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని- సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా 
38  పేతురు - మీర మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 
39  ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. 
40  మరియు ఇంక అనేకవిధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ఖులగుఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. 
41  కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి; ఆ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి. 
42  వీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. 
43  అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. 
44  విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. 
45  ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 
46  మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటరొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 
47  ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము చేర్చుచుండెను. 
Download Audio File

3వ అధ్యాయము

1  పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్లుచుండగా, 
2  పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను వాడు దేవాలయములోకి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. 
3  పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా 
4  పేతురును యోహానును వాని తేరి చూచి - మాతట్టు చూడుమనిరి. 
5  వాడు వారి యొద్ద ఏమైన దొరకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. 
6  అంతట పేతురు - వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి 
7  వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. 
8  వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోకి వెళ్లెను. 
9  వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరుచూచి 
10  శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదాని చూచి విస్మయముతో నిండినవారై పరవశులైరి. 
11  వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా ప్రజలందరు విస్మయమొంది, సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి. 
12  పేతురు దీని చూచి ప్రజలతో ఇట్లనెను - ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా స్వశక్తిచేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? 
13  అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి. 
14  మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. 
15  మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకుమేము సాక్ష్యులము. 
16  ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను, ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ సర్వాంగపుష్టి కలుగజేసెను. 
17  సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. 
18  అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. 
19  ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును 
20  మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి. 
21  అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతపర్యంతము యేసు పరలోక నివాసియైయుండుట అవశ్యకము. 
22  మోషే యిట్లనెను- ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమిచెప్పినను అన్నివిషయములలో మీరాయన మాట వినవలెను
23  ఆ ప్రవక్తమాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను. 
24  మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి. 
25  ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో - నీ సంతానమందు భూలోకవంశములన్నియు అశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులైయున్నారు. 
26  దేవుడు తన సేవకుని పుట్టించి, 5మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్మునాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను. 
Download Audio File

4వ అధ్యాయము

1-2. వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి 
3  వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి. 
4  వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదు వేలు ఆయెను. 
5  మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. 
6  ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరును వారితోకూడ ఉండిరి. 
7  వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి - మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీని చేసితిరని అడుగగా 
8  పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను - ప్రజల అధికారులారా, పెద్దలారా, 
9  ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక 
10  మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొన వలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వాడు స్వస్థతపొందినవాడై మీ యెదుట నిలుచుచున్నాడు. 
11  ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. 6
12  మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని, ఆకాశముక్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. 
13  వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులనిగ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. 
14  స్వస్థతపొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి. 
15  అప్పుడు - సభ వెలిపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి 
16  ఈ మనుష్యులను మనమేమి చేయుదుము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి ప్రత్యక్షమే; అది జరుగలేదని చెప్పజాలము. 
17  అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుడుటకై - ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యునితో నైనను మాటలాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలెనని చెప్పుకొనిరి. 
18  అప్పుడు వారిని పిలిపించి - మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి. 
19  అందుకు పేతురును యోహానును వారిని చూచి - దేవుని మాటవినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టకి న్యాయమా? మీరే చెప్పుడి; 
20  మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. 
21  ప్రజలందరు జరిగినదానిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి 
22  స్వస్థపరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చెయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఏక్కువ వయస్సుగలవాడు. 
23  వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటలనన్నిటిని వారికి తెలిపిరి. 
24  వారు విని, యేకమనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. - నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. 
25  -అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి 
26  ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరిప్రభువు మీదను ఆయన క్రీస్తుమీదనుభూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరిఅని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదునోట పలికించితివి. 2
27-28. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతింపిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. 
29  ప్రభువా, ఈ సమయమున వారి బెదరింపులు చూచి 
30  రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. 
31  వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్నచోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 
32  విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగినవాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. 
33  ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమునకు సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. 
34  భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మినవాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచువచ్చిరి. 
35  వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. 
36  కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి 
37  దాని వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. 
Download Audio File

5వ అధ్యాయము

1  అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. 
2  భార్య యెరుకయే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. 
3  అప్పుడు పేతురు - అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? 
4  అది నీయొద్దనున్నప్పుడు నీదేగదా? అమ్మిన పిమ్మట అది నీ వశమైయుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. 
5  అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను; 
6  అప్పుడు యౌవనస్థులు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. 
7  ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. 
8  అప్పుడు పేతురు - మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె - అవును ఇంతకే అని చెప్పెను. 
9  అందుకు పేతురు - ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను. 
10  వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ యౌవనస్థులు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. 
11  సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. 
12  ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. 
13  కడమవారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు గాని 
14  ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. 
15  అందుచేత పేతురు వచ్చుచుండగా జనములు రోగులను వీధులలోకి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపులమీదను వారిని ఉంచిరి. 
16  మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడినవారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థతపొందిరి. 
17  ప్రధానయూజకుడును అతనితోకూడ ఉన్నవారందరును, అనగా సద్దూకైయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని 
18  అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. 
19  అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలపలికి తీసికొని వచ్చి - మీరు వెళ్లిదేవాలయములో నిలువబడి 
20  ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. 
21  వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోకి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి - వారిని తోడుకొని రండని బంట్రౌతులను బందీగృహమునకు పంపిరి. 
22  బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి 
23  - బందీగృహము బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపులముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. 
24  అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని - ఇది యేమవునో అని వారివిషయమై యెటుతోచక యుండిరి. 
25  అప్పుడొకడు వచ్చి - ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా 
26  అధిపతి బంట్రౌతులతోకూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను. 
27  వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి - మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్యమామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. 
28  వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి - మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్యమామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. 
29  అందుకు పేతురును అపొస్తలులును - మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. 
30  మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. 
31  ఇశ్రాయేలుకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు. 
32  మేమును, దేవుడు తనకు విధేయులైనవారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. 
33  వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివీరిని చంప నుద్దేశించగా 
34  సమస్త ప్రజలవలన ఘనతనొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి - ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను 
35  - ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి. 
36  దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసికొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడినవారందరును చెదరి వ్యర్థులైరి. 
37  వానికి తరువాత జనసంఖ్యదినములలో గలిలైయడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతోకూడ తిరుగబాటు చేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరిపోయిరి. 
38  కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. 
39  దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. 
40  వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి - యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 
41  ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడుటవలన వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయి 
42  ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. 
Download Audio File

6వ అధ్యాయము

1  ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద హెల్లేనిస్తులు సణగసాగిరి. 
2  అప్పుడు పన్నెండుగురు అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి - మేము దేవుని వాక్యము బోధించుట మాని ధనముపంచి పెట్టుటయుక్తముకాదు. 
3  కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; 
4  అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. 
5  ఈ మాట యావన్మందికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫనును, ఫిలిప్పు, ప్రోకొరు, నికానొరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడగు అంతియొకైయ నికొలాను అనువారిని ఏర్పరచుకొని 
6  వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వీరమీద చేతులుంచిరి 
7  దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. 
8  స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుంచుండెను. 
9  అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కూరెనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని 
10  మాటలాడుటయందు అతడు అగుపరచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. 
11  అప్పుడు వారు - వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని 
12  ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి 
13  అతిని పట్టుకొని మహా సభయొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు - ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధస్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. 
14  ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. 
15  సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను. 
Download Audio File

7వ అధ్యాయము

1  ప్రధానయాజకుడు - ఈ మాటలు నిజమేనా అని అడిగెను. 
2  అందుకు స్తెఫను చెప్పినదేమనగా - సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై 
3  - నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. 
4  అప్పుడతడు కల్దీయులదేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడనుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొని వచ్చెను. 
5  ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమియైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేన్పపుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దానిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానముచేసెను. 
6  అయితే దేవుడు - అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరములమట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను. 
7  మరియు దేవుడు - ఏ జనమునకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్నుసేవింతురనియు చెప్పెను. 
8  మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెనుఅతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. 
9  ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరిగాని దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి 
10  దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరోయెదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తుకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. 
11  తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటకిని కరువును బహు శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. 
12  ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. 
13  వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసికొనెను; అప్పుడు యోసేపుయొక్క వంశము ఫరోకు తెలియనాయెను. 
14  యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను, వారు డెబ్బది యయిదుగురై యుండిరి. 
15  యాకోబు ఐగుప్తుకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడనుండి; షెకెముకు తేబడి, 
16  షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రాహాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి. 
17  అయితే దేవుడు అబ్రాహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధిపొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏల నారంభించెను. 
18  ఇతడు మన వంశస్థులయెడల కపటముగా ప్రవర్తించి 
19  తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మనపితరులను బాధపెట్టెను. 
20  ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచబడెను. 
21  తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతని తీసికొని తనకుమారునిగా పెంచుకొనెను. 
22  మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. 
23  అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహాదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. 
24  అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి వాని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను. 
25  తనద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. 
26  మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి - అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పివారిని సమాధానపరచ జూచెను. 
27  అయినను తనపొరుగువానికి అన్యాయము చేసినవాడు - మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడు? 
28  నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంప దలచియున్నావా అని చెప్పి అతని త్రోసివేసెను. 
29  మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరవాసియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులనుకనెను. 
30  నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతరణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగుపడెను. 
31  మోషేచూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా 
32  - నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కువినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు. 
33  అందుకు ప్రభువు - నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి 
34  ఐగుప్తులోనున్న నా ప్రజలదురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగువింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పెను. 2
35  - అధికారినిగాను తీర్పరినిగాను నిన్నునియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను 
36  ఇతడు ఐగుప్తులోను ఎర్రసముద్రములోను నలువది యేండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచకక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. 
37  - నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే. 
38  సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే. 
39  ఇతనికి మన పితరులు లోబడనొల్లకయితని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరినవారై 
40  - మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తుదేశములోనుండి మనలను తోడుకొనివచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహలోనుతో అనిరి. 
41  ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి సమర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. 
42  అందుకు దేవుడు వారికి పరాజ్ముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. 4-ఇశ్రాయేలు ఇంటివారలారామీరు అరణ్యములో నలువది యేండ్లుబలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? 
43  మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైనమొలెకు గుడారమును రొంఫాయనుదేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరిగనుక బాబెలు ఆవలికి మిమ్మును కొనిపోయెదను. 
44  అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను. 
45  మన పితరులు (తమ పెద్దలచేత) దాని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోకి దాని తీసికొనివచ్చిరి, అది దావీదు దినములవరకు ఉండెను. 
46  అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవునికి నివాసస్థలము కట్టగోరెను. 
47  అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను. 
48-50. అయినను - ఆకాశము నా సింహాసనముభూమి నా పాదపీఠముమీరు నాకొరకు ఏలాటి మందిరమును కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది?ఇవన్నియు నా హస్తకృతములు కావా?అని ప్రభువు చెప్పుచున్నాడుఅని ప్రవక్త పలికిన ప్రకారముసర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. 
51  ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, 6మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. 
52  మీ పితరులు ప్రవక్తలలో ఎవని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందుతెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్యచేసినవారైతిరి. 
53  మీరు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును పొందితిరి గాని దాని గైకొనలేదని చెప్పెను. 
54  వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొనిఅతని చూచి పండ్లుకొరికిరి. 
55  అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి 
56  - ఆకాశముతెరువబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. 
57  అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీద పడి 
58  పట్టణపు వెలుపలికి అతని వెళ్లగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనస్థుని పాదములయొద్ద తమవస్త్రములు పెట్టిరి. 
59  ప్రభువునుగూర్చి మొరపెట్టుచు - యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. 
60  అతడు మోకాళ్లూని - ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించినవాడాయెను. 
Download Audio File

8వ అధ్యాయము

1  ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్పు హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరు యూదైయ సమరైయ దేశములయందు చెదరిపోయిరి. 
2  భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిగూర్చి బహుగా ప్రలాపించిరి. 
3  సౌలయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను. 
4  కాబట్టి చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి. 
5  అప్పుడు ఫిలిప్పు సమరైయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 
6  జనసమూహములు విని ఫిలిప్పుచేసిన సూచకక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా 
7  అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువుగలవారును కుంటివారును అనేకులు స్వస్థతపొందిరి. 
8  అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. 
9  సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెనవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరైయ జనులను విభ్రాంతి పరచుచుండెను. 
10  కొద్దివాడు మొదలుకొని గొప్పవానిమట్టుకు అందరు - దేవుని మహాశక్తి యనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. 
11  అతడు బహుకాలము గారడీలుచేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్యపెట్టిరి. 
12  అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసు క్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. 
13  అప్పుడు సీమోనుకూడ నమ్మి బాప్తిస్మముపొంది, ఫిలిప్పును ఎడబాయకుండి, సూచకక్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతినొందెను. 
14  సమరైయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారియొద్దకు పంపిరి. 
15  వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి. 
16  అంతకుముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందినవారై యుండిరి. 
17  అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 
18  అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి 
19  వారియెదుట ద్రవ్యము పెట్టి - నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. 
20  అందుకు పేతురు - నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడ నశించుగాక. 
21  నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. 
22  కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును; 
23  నీవు ఘోరదుష్టత్వములోనుదుర్ణీతిబంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. 
24  అందుకు సీమోను - మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. 
25  అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యముబోధించి యెరూషలేముకు తిరిగి వెళ్లుచు, సమరైయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. 
26  ప్రభువు దూత - నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేమునుండి గాజాకుపోవు అరణ్యమార్గమును కలిసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను. 
27  అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటిమీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చియుండెను. 
28  అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను. 
29  అప్పుడు ఆత్మ - నీవు ఆ రథము దగ్గరకు పోయిదాని కలిసికొనుమని చెప్పెను. 
30  ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని - నీవు చుదువునది గ్రహించుచున్నావా అని అడుగగా 
31  అతడు - నాకెవడైనను త్రోవచూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. 
32  అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగాఆయన గొర్రెవలె వధకు తేబడెనుబొచ్చు కత్తిరించువాని యెదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. 
33  ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెనుఆయన సంతానము ఎవరు వివరింతురు?ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది. 
34  అప్పుడు నపుంసకుడు - ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను. 
35  అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను. 
36-38. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్నయొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు - ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. 2ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. 
39  వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు. 
40  అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరైయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. 
Download Audio File

9వ అధ్యాయము

1  సౌలు ఇంక ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి 
2  యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల వారిని బంధించి యెరూషలేముకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను. 
3  అతడు ప్రయాణముచేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. 
4  అప్పుడతడు నేలపడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దము పలుకుట వినెను. 
5  - ప్రభువా, నీ వెవడవని అతడడుగగా ఆయన -నేను నీవు హింసించుచున్న యేసును; 
6  లేచి పట్టణములోకి వెళ్లుము, అక్కడ నీవు యేమిచేయవలెనో అదినీకు తెలుపబడునని చెప్పెను. 
7  అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి. 
8  సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోకి నడిపించిరి. 
9  అతడు మూడు దినములు దృష్టిలేనివాడై అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. 
10  దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు - అననీయా, అని అతని పిలువగా 
11  అతడు - ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు - నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు. 
12  అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి, తాను దృష్టిపొందునట్లు తనమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. 
13  అందుకు అననీయ - ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలోములో నీ పరిశుద్ధులకు ఎంతోకీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. 
14  ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయువారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను. 
15  అందుకు ప్రభువు - నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు. 3
16  ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 
17  అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి అతనిమీద చేతులుంచి - సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. 
18  అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టి కలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. 
19  పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్నిదినములుండెను. 
20  వెంటనే సమాజమందిరములలో - యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను. 
21  వినినవారిందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థనచేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడివచ్చియున్నాడని చెప్పుకొనిరి. 
22  అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి - ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. 
23  అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని చంపనాలోచింపగా 
24  వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని దివారాత్రులు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి 
25  గనుక అతని శిష్యులు రాత్రివేళ అతని తీసికొనిపోయి గంపలో ఉంచి గోడగుండ అతనిని క్రిందికి దింపిరి. 
26  అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నముచేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. 
27  అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి - అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. 
28-29. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచుపోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, హెల్లేనిస్తులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతని చంప ప్రయత్నముచేసిరి గాని 
30  సహోదరులు దీని తెలిసికొని అతని కైసరైయకు తోడుకొనివచ్చి తార్సుకు పంపిరి. 
31  కావున యూదైయ గలిలైయ సమరైయ దేశములయందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచుసమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 
32  ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను. 
33  అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిదిఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయా అను ఒక మనుష్యుని చూచి. 
34  పేతురు - ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా 
35  వెంటనే అతడు లేచెను. లుద్దలోను సారోనులోను కాపురమున్నవారందరు అతని చూచి ప్రభువుతట్టు తిరిగిరి. 
36  మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కాఅని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. 
37  ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమునుకడిగి మేడగదిలో పరుండబెట్టిరి. 
38  లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులువిని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతనియొద్దకు పంపిరి. 
39  పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతని తీసికొనివచ్చిరి; విధవరాండ్లందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతో కూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు తనయెదుట నిలిచిరి. 
40  పేతురు అందరిని వెలపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి - తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. 
41  అతడామెకు చెయ్యియిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. 
42  ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. 
43  పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను. 
Download Audio File

10వ అధ్యాయము

1  ఇతలియ పటాలమనబడిన పటాలములో శతాధిపతియైన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరైయలో ఉండెను 
2  అతడు తన యింటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్ధనచేయువాడు. 
3  పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి - కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. 
4  అతడు దూత వైపు తేరి చూచి భయపడి - ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత - నీ ప్రార్ధనలను నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి. 
5  ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము; 
6  అతడు సముద్రపు దరినున్నసీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను. 
7  అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తిపరుడగు ఒక రాణువవానిని పిలిచి 
8  వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను. 
9  మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్ధన చేయుటకు మిద్దమీదికెక్కెను. 
10  అతడు మిక్కిలి అకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై 
11  ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టిదింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను. 
12  అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను. 
13  అప్పుడు - పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను. 
14  అయితే పేతురు - వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా 
15  దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను. 
16  ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. 
17  పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి 
18  పేతురు అను మారు పేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి 
19  పేతురు ఆ దర్శనముగూర్చి యోచించుచుండగా ఆత్మ - ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు. 
20  నీవు లేచి క్రిందికిదిగి సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. 
21  పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చి - ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణమేమని అడిగెను. 
22  అందుకు వారు - నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియైన కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూతవలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. 
23  మరునాడు అతడు లేచి వారితోకూడ బయలుదేరెను, యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి; 
24  మరునాడు వారు కైసరైయలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధవులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను. 
25  పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను. 
26  అందుకు పేతురు - నీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి 
27  అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను. 
28  అప్పుడతడు - అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింప దగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు. 
29  కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువనంపితిరో దాని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను. 
30  అందుకు కొర్నేలి - నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్ధనచేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యొదుట నిలిచి 
31  -కొర్నేలి నీ ప్రార్ధన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి 
32  పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. 
33  వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు అజ్ఞాపించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను 
34  - దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. 
35  ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును. 
36  యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. 
37  యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలైయ మొదలుకొని యూదైయయందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును. 
38  అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడినవారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. 
39  ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. 
40  దేవుడాయనను మూడవ దినమున లేపి 
41  ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతోకూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. 
42  ఇదియు గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. 
43  ఆయనయందు విశ్వాశముంచువాడెవడో వాడు ఆయన నామముమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. 
44  పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను. 
45-46. సున్నతి పొందిన వారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచునుండగా వినిరి. 
47  అందుకు పేతురు - మనవలె పరిశుద్ధాత్మను పొందినవీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి 
48  యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి. 
Download Audio File

11వ అధ్యాయము

1  అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదైయయందంతటనున్న సహోదరులును వినిరి. 
2  పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు 
3  - నీవు సున్నతిపొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. 
4  అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి సంగతి ఈలాగు వివరించి చెప్పెను 
5  - నేను యొప్పేపట్టణములో ప్రార్థచేయుచుండగా పరవశుడనైతిని; అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్దదుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను. 
6  దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాదజంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను. 
7  అప్పుడు - పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని. 
8  అందుకు నేను - వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా 
9  రెండవమారు ఆ శబ్దము ఆకాశమునుండి - దేవుడు పవిత్రముచేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. 
10  ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొనిపొబడెను. 
11  వెంటనే కైసరైయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచియుండిరి. 
12  అప్పుడు ఆత్మ - నీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి. 
13  అప్పుడతడు - నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; 
14  నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. 
15  నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మనమీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. 
16  అప్పుడు -యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేనుజ్ఞాపకము చేసికొంటిని. 
17  కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికికూడ సమానవరము అనుగ్రహించియుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను. 
18  వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక - అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సుదయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. 
19  స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదరిపోయినవారి యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకైయ ప్రదేశములవరకు సంచరించిరి. 
20  కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి, వీరు అంతియొకైయకు వచ్చి హెల్లేనీయులతో మాటలాడుచు ప్రభువైన యేసునుగూర్చిన సువార్త ప్రకటించిరి; 
21  ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మినవారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి 
22  వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకైయవరకు పంపిరి. 
23  అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను. 
24  అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షము చేరిరి. 
25  అంతట అతడు సౌలును వెదకుటకు తార్సుకు వెళ్లి అతని కనుగొని అంతియొకైయకు తోడుకొని వచ్చెను. 
26  వారు కలిసి యొక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనులకు (వాక్యమును) బోధించిరి. మొట్టమొదట అంతియొకైయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. 
27  ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకైయకు వచ్చిరి. 
28  వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. 
29  అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదైయలో కాపురమున్న సహోదరులకు సహాయార్థముగా సొమ్ముపంపుటకు నిశ్చయించుకొనెను. 
30  ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దాని పంపిరి. 
Download Audio File

12వ అధ్యాయము

1  ఆ కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని 
2  యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. 
3  ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. 
4  అతని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కాపండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల రాణువవారికి అతనిని అప్పగించెను. 
5  పేతురు చెరసాలలో ఉంచబడెను, అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థనచేయుచుండెను. 
6  హేరోదు అతనిని వెలపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు రాణువవారి మధ్య నిద్రించుచుండెను; మరియు కావలివారు తులుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. 
7  ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన అరలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి - త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడి పడెను. 
8  అప్పుడు దూత అతనితో - నీవు నడుము కట్టుకొని తరువాత దూత - నీ వస్త్రము పైన వేసికొని వా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. 
9  అతడు వెలపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను. 
10  మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుపగవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటిన వెంటనే దూత అతని విడిచిపోయెను. 
11  పేతురుకు తెలివివచ్చి - ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతోలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటిన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను. 
12  ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ ఆనేకులు కూడి ప్రార్థనచేయుచుండిరి. 
13  అతడు తలవాకిట తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. 
14  ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముచేత తలుపు తీయక లోపలికి పరుగెత్తికొనిపోయి - పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. 
15  అందుకు వారు - నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు - అతని దూత అనిరి. 
16  పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. 
17  అతడు - ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి - యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్లెను. 
18  తెల్లవారగానే పేతురు ఏమాయెనో అని రాణువవారిలో కలిగిన గలిబిలి యింతంతకాదు. 
19  హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞిపించెను. అటుతరువాత హేరోదు యూదైయనుండి కైసరైయకు వెళ్లి అక్కడ నివసించెను. 
20  తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధానపడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. 
21  నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠముమీద కూర్చుండి వారియెదుట ఉపన్యాసముచేయగా 
22  జనులు - ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలుపేసిరి. 
23  అతడు దేవుని మహిమపరచనందున వెటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులుపడి ప్రాణము విడిచెను. 
24  దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. 
25  బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి. 
Download Audio File

13వ అధ్యాయము

1  అంతియొకైయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ, చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. 
2  వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ - నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. 
3  అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి. 
4  కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూకియకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి. 
5  వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడైయుండెను. 
6  వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. 
7  ఇతడు వివేకముగలవాడైన సెర్గియ పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. 
8  అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరుకు గారడీవాడని అర్థము. 
9  అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై 
10  అతని తేరి చూచి - సమస్తకపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాదికుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? 
11  ఇదిగో ప్రభువు తన చెయ్యినీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యిని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యి పట్టుకొని నడిపంతురా అని వెదకుచుండెను. 
12  అంతట ఆ అధిపతి జరిగినదాని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. 
13  తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ ఎక్కి పాపునుండి బయలుదేరి పంపులియలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లెను. 
14  అప్పుడు వారు పెర్గేనుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకైయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోకి వెళ్లి కూర్చుండిరి. 
15  ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు - సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. 
16  అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను - 
17  ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరవాసులైయున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొని వచ్చి 
18  యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. 
19  మరియు కనాను దేశములో ఏడు జాతులవారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను. 
20  ఇంచుమించు నన్నూట ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. 
21  ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల పర్యంతము దయచేసెను. 
22  తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన - నేను యెష్షయి కుమారుడైన దావీదు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని కనుగొంటినని చెప్పి అతనిగూర్చి సాక్ష్యమిచ్చెను. 
23  అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. 
24  ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. 
25  యోహాను తన పనిని నెరవేర్చుచుండగా - నేనెవడనని మీరు ఊహించుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైన నేను పాత్రుడను కానని చెప్పెను. 
26  సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది. 
27  యెరూషలేములో కాపురముండువారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్ష విధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి. 
28  ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. 
29  వారు ఆయననుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి. 
30  అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను. 
31  ఆయన గలిలైయనుండి యెరూషలేముకు తనతోకూడ వచ్చిన వారికి అనేక దినములు కనబడెను; వారిప్పుడు ప్రజలయొదుట ఆయనకు సాక్షులైయున్నారు. 
32-33. దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే -నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటినిఅని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది. 2
34  మరియు ఇకను కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటనుబట్టి - దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. 
35  కాబట్టి వేరొక కీర్తనయందు3- నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవని చెప్పుచున్నాడు. 
36-37. దావీదు దేవుని సంకల్పముచొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి తన పితరులయొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు. 
38  కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, 
39  మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక. 
40  ప్రవక్తల గ్రంథమందు1చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా 
41  - ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడినశించుడిమీ దినములలో నేనొక కార్యము చేసెదనుఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంతమాత్రమును నమ్మరు. 
42  వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. 
43  సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి. 
44  మరుసటి విశ్రాంతిదినము దాదాపుగ ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను. 
45  యూదులు జనుసమూహములను చూచి మత్సరముతో నిండకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి. 
46  అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి - దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే; అయినను మీరు దాని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము; 
47  ఏలయనగా - నీవు భూదింగతములవరకు రక్షణార్థముగా ఉండునట్లునిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నానుఅని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. 2
48  అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి. 
49-50. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందతట వ్యాపించెను గాని యూదుల భక్తిమర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి. 
51  వీరు తమ పాద ధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. 
52  అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి. 
Download Audio File

14వ అధ్యాయము

1  ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజమందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులును హెల్లేనీయులును విశ్వసించిరి. 3
2  అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించిరి. 
3  కాబట్టి వారు ప్రభవును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారిచేత సూచక క్రియలను మహత్కార్యములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. 
4  ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి. 
5  మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి. 
6  వారాసంగతి తెలిసికొని లుకయోనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. 
7-8. లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడవలేక కూర్చుండియుండువాడు. 
9  అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరిచూచి, స్వత్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి 
10  - నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువసాగెను. 
11-12. జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో - దేవతలు మనుష్యరూపముదాల్చి మనయొద్దకు దిగి వచ్చుచున్నారని కేకలువేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగియైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. 
13  పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతియొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెననియుండెను. 
14  అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోకి చొరబడి 
15  - అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. 
16  ఆయన గతకాలములలో సమస్త జనులను తమ మార్గములయందు నడువనిచ్చెను. 
17  అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును ఫలవంతములైన రుతువులును దయచేయుచు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి. 
18  వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండ సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. 
19  అంతియొకైయనుండియు ఈకొనియనుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలపలికి అతనిని ఈడ్చిరి. 
20  అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరిపోయెను. 
21  వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులునుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకైయకును తిరిగి వచ్చి 
22  శిష్యుల మనస్సులను దృఢపరచి - విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. 
23  మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థనచేసి, వారునమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. 
24  తరువాత పిసిదియదేశమంతట సంచరించి పంపులియకు వచ్చిరి 
25  మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకువెళ్లిరి. 
26  అక్కడనుండి ఓడయెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవునికృపకు అప్పగింపబడినవారై, 
27  వారు వచ్చి సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. 
28  పిమ్మట వారు శిష్యులయొద్ద బహుకాలము గడిపిరి. 
Download Audio File

15వ అధ్యాయము

1  కొందరు యూదైయనుండి వచ్చి - మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతిపొందితేనేగాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 
2  పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేముకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహాదరులు నిశ్చయించిరి. 
3  కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనికే సమరైయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి. 
4  వారు యెరూషలేముకు రాగా సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; వారు తమకు దేవుడు తోడైయుండి చేసినవన్నియు వివరించిరి. 
5  పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. 
6  అప్పుడు అపొస్తలులును పెద్దలును ఆ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను - 
7  సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియును. 
8  మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించిట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారినిగూర్చి సాక్ష్యమిచ్చెను. 
9  వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు 
10  గనుక మనపితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యులమెడమీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? 
11  ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? ఆలాగే వారును రక్షణ పొందుదురు. 
12  అప్పుడు ఆ సమూహమంతయు ఊరకుండి, బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనలలో చేసిన సూచకక్రియలను మహత్కార్యములను వివరించగా ఆలకించెను. 
13  వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను - సహోదరులారా, నా మాట ఆలకించుడి. 
14  అన్యజనులలోనుండి దేవుడు తననామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు. 
15  ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి, ఎట్లనగా- 
16  ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యలలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు 
17  పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దాని నిలువబెట్టెదనని 
18  అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది. 
19  కాబట్టి అన్యజనులలో నుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక 
20  విగ్రహసంబంధముచేత కలుగు అపవిత్రతము, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును విసర్జించుడని వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. 
21  ఏలయనగా సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరములనుండి అతని (నియమమును) ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. 
22  అప్పుడు సహెదరులలో ముఖ్యులైన బర్సబ్బాఅను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకైయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. 
23  వీరు వ్రాసివారిచేత పంపినదేమనగా - అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకైయలోను, సురుయలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము. 
24  కొందరు మాయొద్దనుండి వెళ్లి తమబొధచేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమాజ్ఞయిచ్చి యుండలేదు 
25-26. గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. 
27  కాగా యూదాను సీలను పంపియున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. 
28-29. విగ్రహార్పితములైనవాటిని, రక్తమును, గొంతు పిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగు గాక. 
30  అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకైయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. 
31  వారు దాని చుదవుకొని అందువలన ఆదరణ కలిగి సంతోషించిరి. 
32  మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి. 
33-34. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరులయొద్దనుండి తమ్మును పంపినవారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవుపుచ్చుకొనిరి. 
35  అయితే పౌలును బర్నబాయు అంతియొకైయలో నిలిచి, యింక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. 
36  కొన్ని దినములైన తరువాత పౌలు - ఏయే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆ యా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు మనము తిరిగి వెళ్లి వారేలాగున్నారో చూతుమని బర్నబాతో అనెను. 
37  అప్పుడు మార్కు అను మారు పేరుగల యోహానును వెటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను 
38  అయితే పౌలు, పంపులియలో పనికొరకు తమతోకూడ రాకపోయి తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. 
39  వారిలో తీక్ష్ణమైన వాదము కలిగినందున వారు ఒకని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని, ఓడ ఎక్కికుప్రకు వెళ్లెను; 
40 -41. పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, సంఘములను స్థిరపరచుచు సురియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. 
Download Audio File

16వ అధ్యాయము

1  తరువాత పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమొథెయు అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి హెల్లేనీయుడు. 
2  అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు 
3  అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలు కోరి, అతని తండ్రి హెల్లేనీయుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను. 
4  వారు ఆ యా పట్టణములద్వారా వెళ్లుచు, యెరూషలోములోనున్న అపొస్తలులును పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. 
5  గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను 
6  ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున వారు ప్రుగియ గలతీయ ప్రదేశములద్వారా వెళ్లిరి. ముసియ దగ్గెరకు వచ్చి బితునియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని 
7  యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. 
8  అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. 
9  అప్పుడు మకెదొనియ దేశస్థుడైన యొకడు నిలిచి - నీవు మకెదొనియకు వచ్చి మాకు సహాయము చేయుమని అతని వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను. 
10  అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మకెదొనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. 
11  కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకెకును, మరునాడు నెయపొలికిని, అక్కడనుండి ఫిలిప్పయికిని వచ్చితిమి. 
12  మకెదొనియ దేశములో ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి. 
13  విశ్రాంతి దినమున గవిని నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. 
14  అప్పుడు లుదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ధూమ్రవర్ణచూర్ణమును అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. 
15  ఆమెయు ఆమెయింటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె - మీరు నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని యెంచితే నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. 
16  (మరియొక సమయమున) మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా పుతోను అను దయ్యముపట్టినదై, సోదెచెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. 
17  ఆమె పౌలును మమ్మును వెంబడించి - ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణమార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను. 
18  ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి - నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; తత్క్షణమే అది ఆమెను వదిలిపోయెను. 
19  ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోకి అధికారులయొద్దకు ఈడ్చుకొని పోయిరి. 
20  అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి - ఈ మనుష్యులు యూదులై యుండి 
21  రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. 
22  అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. 
23  వారు చాలాదెబ్బలు కొట్టివారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికాజ్ఞాపించిరి. 
24  అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోకి త్రోసి, వారికాళ్లకు బొండవేసి బిగించెను. 
25  అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునిగూర్చి ప్రార్థించుచు క్రీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వారు పాడుటవినుచుండిరి. 
26  అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. 
27  అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి తన్నుతాను చంపుకొనబోయెను. 
28  అప్పుడు పౌలు - నీకు నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను. 
29  అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి దుమికివచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి 
30  , వారిని వెలపలికి తీసికొని వచ్చి - అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. 
31  అందుకు వారు - ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి 
32  అతనికిని అతని ఇంటనున్నవారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. 
33  రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొని వచ్చి వారి దెబ్బల గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. 
34  మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను. 
35  ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు - ఆ ముష్యులను విడుదలచేయుమని చెప్పుటకు వేత్రధరులను పంపిరి. 
36  చెరసాల నాయకుడీమాటలు పౌలుకు తెలిపి - మిమ్మును విడదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. 
37  అయితే సౌలు - వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలపలికి తీసికొని పోవలెనని చెప్పెను. 
38  ఆ వేత్రధరులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా, వీరు రోమీయులన్నవార్త వారు విని భయపడి వచ్చి 
39  వారిని బ్రతిమాలుకొని వెలపలికి తీసికొనిపోయి - పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. 
40  వారు చెరసాలలోనుండి వెలపలికి వచ్చి లుదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. 
Download Audio File