Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

24వ అధ్యాయము

1  అయిదు దినములైనతరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక వక్తయు (కైసరైయకు) వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. 
2  పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరముమోప నారంభించి యిట్లనెను 
3  మహా ఘనతవహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశజనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శచేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకలవిధములను సకలస్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. 
4  నేను తమకు విశేషమైన ఆయాసము కలుగజేయకుండ మేము సంక్షేపముగా చెప్పుకొనుదానిని తమకు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. 
5  ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి. 
  6-7. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. 1
8  తమరు విమర్శంచిన యెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను. 
9  యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి. 
10  అప్పుడు అధిపతి - మాటలాడుమని పౌలుకు సైగచేయగా అతడిట్లనెను - తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. 
11  యెరూషలోములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పన్నెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొనవచ్చును. 
12  దేవాలయములో నేమి సమాజమందిరములోనేమి పట్టణములోనేమి నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు. 
13  మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. 
14-15. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షిణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను. 
16  ఈ విధమున నేను దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను. 
17  కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు ధర్మద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని. 
18  నేను శుద్ధిచేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి; 
19  నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికి వచ్చి నామీద నేరము మోపవలసియుండెను. 
20-21. లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్కమాట విషయమై తప్ప నాయందు మరి యే నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను. 
22  ఫేలిక్సు ఈ మార్గమువిషయమైన సంగతులు బాగుగా ఎరిగినవాడై - సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపుచేసెను. 
23  మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. 
24  కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను. 
25  అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమునుగూర్చియు రాబోవువిమర్శనుగూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి - ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపింతునని చెప్పెను. 
26  తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 
27  రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను. 
Download Audio File

No comments:

Post a Comment