1 ఆ కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని
2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.
3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.
4 అతని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కాపండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల రాణువవారికి అతనిని అప్పగించెను.
5 పేతురు చెరసాలలో ఉంచబడెను, అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థనచేయుచుండెను.
6 హేరోదు అతనిని వెలపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు రాణువవారి మధ్య నిద్రించుచుండెను; మరియు కావలివారు తులుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.
7 ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన అరలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి - త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడి పడెను.
8 అప్పుడు దూత అతనితో - నీవు నడుము కట్టుకొని తరువాత దూత - నీ వస్త్రము పైన వేసికొని వా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.
9 అతడు వెలపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.
10 మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుపగవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటిన వెంటనే దూత అతని విడిచిపోయెను.
11 పేతురుకు తెలివివచ్చి - ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతోలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటిన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.
12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ ఆనేకులు కూడి ప్రార్థనచేయుచుండిరి.
13 అతడు తలవాకిట తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
14 ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముచేత తలుపు తీయక లోపలికి పరుగెత్తికొనిపోయి - పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.
15 అందుకు వారు - నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు - అతని దూత అనిరి.
16 పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి.
17 అతడు - ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి - యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్లెను.
18 తెల్లవారగానే పేతురు ఏమాయెనో అని రాణువవారిలో కలిగిన గలిబిలి యింతంతకాదు.
19 హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞిపించెను. అటుతరువాత హేరోదు యూదైయనుండి కైసరైయకు వెళ్లి అక్కడ నివసించెను.
20 తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధానపడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠముమీద కూర్చుండి వారియెదుట ఉపన్యాసముచేయగా
22 జనులు - ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలుపేసిరి.
23 అతడు దేవుని మహిమపరచనందున వెటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులుపడి ప్రాణము విడిచెను.
24 దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
25 బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.
Download Audio File

No comments:
Post a Comment