1 ప్రధానయాజకుడు - ఈ మాటలు నిజమేనా అని అడిగెను.
2 అందుకు స్తెఫను చెప్పినదేమనగా - సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
3 - నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.
4 అప్పుడతడు కల్దీయులదేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడనుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొని వచ్చెను.
5 ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమియైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేన్పపుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దానిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానముచేసెను.
6 అయితే దేవుడు - అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరములమట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను.
7 మరియు దేవుడు - ఏ జనమునకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్నుసేవింతురనియు చెప్పెను.
8 మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెనుఅతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
9 ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరిగాని దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి
10 దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరోయెదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తుకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
11 తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటకిని కరువును బహు శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.
12 ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను.
13 వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసికొనెను; అప్పుడు యోసేపుయొక్క వంశము ఫరోకు తెలియనాయెను.
14 యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను, వారు డెబ్బది యయిదుగురై యుండిరి.
15 యాకోబు ఐగుప్తుకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడనుండి; షెకెముకు తేబడి,
16 షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రాహాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
17 అయితే దేవుడు అబ్రాహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధిపొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏల నారంభించెను.
18 ఇతడు మన వంశస్థులయెడల కపటముగా ప్రవర్తించి
19 తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మనపితరులను బాధపెట్టెను.
20 ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచబడెను.
21 తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతని తీసికొని తనకుమారునిగా పెంచుకొనెను.
22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
23 అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహాదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
24 అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి వాని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.
25 తనద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి.
26 మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి - అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పివారిని సమాధానపరచ జూచెను.
27 అయినను తనపొరుగువానికి అన్యాయము చేసినవాడు - మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడు?
28 నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంప దలచియున్నావా అని చెప్పి అతని త్రోసివేసెను.
29 మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరవాసియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులనుకనెను.
30 నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతరణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగుపడెను.
31 మోషేచూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా
32 - నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కువినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు.
33 అందుకు ప్రభువు - నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి
34 ఐగుప్తులోనున్న నా ప్రజలదురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగువింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుదునని అతనితో చెప్పెను. 2
35 - అధికారినిగాను తీర్పరినిగాను నిన్నునియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను
36 ఇతడు ఐగుప్తులోను ఎర్రసముద్రములోను నలువది యేండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచకక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.
37 - నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.
38 సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.
39 ఇతనికి మన పితరులు లోబడనొల్లకయితని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరినవారై
40 - మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తుదేశములోనుండి మనలను తోడుకొనివచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహలోనుతో అనిరి.
41 ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి సమర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.
42 అందుకు దేవుడు వారికి పరాజ్ముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. 4-ఇశ్రాయేలు ఇంటివారలారామీరు అరణ్యములో నలువది యేండ్లుబలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?
43 మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైనమొలెకు గుడారమును రొంఫాయనుదేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరిగనుక బాబెలు ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
44 అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.
45 మన పితరులు (తమ పెద్దలచేత) దాని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోకి దాని తీసికొనివచ్చిరి, అది దావీదు దినములవరకు ఉండెను.
46 అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవునికి నివాసస్థలము కట్టగోరెను.
47 అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను.
48-50. అయినను - ఆకాశము నా సింహాసనముభూమి నా పాదపీఠముమీరు నాకొరకు ఏలాటి మందిరమును కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది?ఇవన్నియు నా హస్తకృతములు కావా?అని ప్రభువు చెప్పుచున్నాడుఅని ప్రవక్త పలికిన ప్రకారముసర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.
51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, 6మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
52 మీ పితరులు ప్రవక్తలలో ఎవని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందుతెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్యచేసినవారైతిరి.
53 మీరు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును పొందితిరి గాని దాని గైకొనలేదని చెప్పెను.
54 వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొనిఅతని చూచి పండ్లుకొరికిరి.
55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి
56 - ఆకాశముతెరువబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను.
57 అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీద పడి
58 పట్టణపు వెలుపలికి అతని వెళ్లగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనస్థుని పాదములయొద్ద తమవస్త్రములు పెట్టిరి.
59 ప్రభువునుగూర్చి మొరపెట్టుచు - యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
60 అతడు మోకాళ్లూని - ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించినవాడాయెను.
Download Audio File

No comments:
Post a Comment