1 మేము ఓడ యెక్కి ఇతలియకు వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అనువారికి అప్పగించిరి.
2 ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడ మేమెక్కి బయలుదేరితిమి; మకెదొనీయుడును థెస్సలొనీకే పట్టనస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను.
3 మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలుమీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామర్శపొందుటకు అతనికి సెలవిచ్చెను.
4 అక్కడనుండి బయలు దేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించితిమి.
5 మరియు కిలికియకును పంపులియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి.
6 అక్కడ శతాధిపతి ఇతలియకు వెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను.
7 అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకుంన్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి.
8 బహు కష్టపడి దాని దాటి మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దానిదగ్గర లసైయ పట్టిణముండెను.
9 చాల కాలమైన తరువాత ఉపవాసదినముకూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయకరమై యుండెను.
10 అప్పుడు పౌలు - అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమేకాక మన ప్రాణములకుకూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.
11 అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. మరియు ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.
12 మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు ఉపయుక్తము కానిదైనందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సుకు చేరి అక్కడ శీతకాలము గడుపవలెనని యెక్కువమంది ఆలోచన చెప్పిరి. అది నైరృతి వాయవ్యదిక్కుల తట్టుననున్న క్రేతు రేవై యున్నది.
13 మరియు దక్షిణపుగాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి.
14 కొంతసేపైన తరువాత ఉరాకూలోనను పెనుగాలి క్రేతుమీదనుండి విసరెను.
15 దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి.
16 తరువాత కౌద అనబడిన యొక చిన్నద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయెను.
17 దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్పమీద పడుదుమేమో అని భయపడి ఓడచాపలు దింపివేసి కొట్టుకొనిపోయిరి.
18 మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయసాగిరి.
19 మూడవ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రి పారవేసిరి.
20-21. కొన్ని దినములు సూర్యడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశబొత్తుగ పోయెను. వారు బహూకాలము భోజనములేక యున్నందున పౌలు వారి మధ్యను నిలిచి - అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలు దేరకయే యుండవలసినది, అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.
22 ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచుచన్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు.
23 నేను ఎవనివాడనో, యెవని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచినరాత్రి నా యొద్ద నిలిచి - పౌలా, భయపడకుము;
24 నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.
25 కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్మచున్నాను.
26 అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసియుండునని చెప్పెను.
27 పదునాలుగవరాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి
28 బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంక కొంతదూరము వెళ్లిన తరువాత మరల బుడుదువేసి చూచి పదునయిదు బారల లోతని తెలిసికొనిరి.
29 అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్లవారునా అని కాచుకొనియుండిరి.
30 అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపవేసిరి.
31 అందుకు పౌలు - వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను రాణువవారితోను చెప్పెను.
32 వెంటనే రాణువవారు పడవత్రాళ్లు కోసి దాని కొట్టుకొనిపోనిచ్చిరి.
33-34. తెల్లవారుచుండగా పౌలు - పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక నిరాహారులై కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తలనుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.
35 ఈ మాటలు చెప్పి యొక రొట్టె పట్టుకొని అందరియొదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను.
36 అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.
37 ఓడలో ఉన్న మేమందరము ఇన్నూట డెబ్బది ఆరుగురమై యుంటిమి.
38 వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి.
39 ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనయెడల అందులోకి ఓడను త్రోయవలెనని ఆలోచించిరి.
40 గనుక లంగరుల త్రాళ్లు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని
41 రెండు ప్రవాహములు కలిసిన1స్థలమందు ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను.
42 ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని రాణువవారికి ఆలోచన పుట్టెను గాని
43 శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు
44 కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కలమీదను పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరి చేరిరి.
Download Audio File

No comments:
Post a Comment