Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

20వ అధ్యాయము

1  ఆ అల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తనయొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మకెదొనియకు వెళ్లుటకు బయలుదేరెను. 
2  ఆ ప్రదేశములయుందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి హెల్లాసుకు వచ్చెను. 
3  అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సురయకు వెళ్లవలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్రచేయుచున్నందున మకెదొనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను. 
4  మరియు పుర్రు కుమారుడును బెరైయదేశస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకైయలలో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమొథెయును, ఆసియ దేశస్థులైన తుకికును, త్రోపిమును అతనితో కూడ వచ్చిరి. 
5  వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొనియుండిరి. 
6  పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పయి విడిచి అయిదు దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితిమి 
7  ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. 
8  మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. 
9  అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢనిద్రపోయి, పౌలు చాలసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయినవాడై యెత్తబడెను. 
10  అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొని - మీరు తొందరపడకుడి, తన ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను. 
11  అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. 
12  వారు బ్రదికిన ఆ చిన్నవాని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. 
13  మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితిమి. తాను కాలినడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను. 
14  అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. 
15  అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసుకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సామొసుకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. 
16  సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటి పోవలెనని నిశ్చయించుకొని యుండెను. 
17  అతడు మిలేతునుండి ఎఫెసుకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. 
18  వారు తనయొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను - నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి సర్వకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు. 
19  యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. 
20 -21. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని విషయమై మారుమనస్సుపొంది మన ప్రభవైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును హెల్లేనీయులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును. 
22  ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు నిర్బంధముగలవాడనై యెరూషలేముకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని, 
23  బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. 
24  అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నాపరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. 
25  ఇదిగో (దేవుని) రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని గదా? మీలో ఎవరును ఇకమీదట నాముఖము చూడరని నాకిప్పుడు తెలియును. 
26  కాబట్టి మీలో ఎవరినాశనము విషయమైననునేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. 2
27  దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు. 
28  దేవుడుతన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. 
29  నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. 
30  మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని ప్రతికూల వచనములు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. 
31  కావున నేను మూడు సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్లు విడచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెళకువగా ఉండుడి. 
32  ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు. 
33  ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; 
34  నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. 
35  మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు - పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్నివిషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. 
36  అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థనచేసెను. 
37  అప్పుడు వారందరు బహుగా ఏడ్చిరి. మీరు ఇకమీదట నాముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు 
38  పౌలు మెడమీద పడి అతని ముద్దుపెట్టుకొని వారు ఓడ దనుక అతని సాగనంపిరి. 
Download Audio File

No comments:

Post a Comment