1 అగ్రిప్ప పౌలును చూచి - నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయిచాచి యీలాగు సమాధానము చెప్పసాగెను -
2 అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక
3 యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను.
4 మొదటనుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదకిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.
5 వారు మొదటనుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యడనుగా ప్రవర్తించినట్లు(చెప్పగలరు).
6 ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానమువిషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.
7 మన పన్నెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపియున్నారు.
8 దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?
9 నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;
10 యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;
11 అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్టి చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని.
12 అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కుకు పోవుచుండగా
13 రాజా, మధ్యహ్నమందు నా చుట్టును నాతో కూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్యతేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.
14 మేమందరమును నేలపడినప్పుడు - సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.
15 అప్పుడు నేను - ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను - నీవు హింసించుచున్న యేసును.
16-18. నీవు నన్నుచూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను నీవులేచి నీ పాదములు మోపి నిలువుము; నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను; వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నాయందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధ పరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
19 కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడనుకాక
20 మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదైయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.
21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి;
22-23. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుండి - క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము (పొందువారి) లో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.
24 అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు - పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్యవలన నీకు వెర్రిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.
25 అందుకు పౌలు ఇట్లనెను - మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియుగల మాటలనే చెప్పుచున్నాను.
26 రాజు గారు ఈ సంగతులెరుగుదురు గనుక అతనియెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగై యుండలేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యముకాదు.
27 అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.
28 అందుకు అగ్రిప్ప - ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిచేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.
29 అందుకు పౌలు - సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.
30 అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి
31 - ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.
32 అందుకు అగ్రిప్ప - ఈ మనుష్యుడు - కైసరు ఎదుట చెప్పుకొందునని అనినయెడల ఇతని విడుదలచేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.
Download Audio File

No comments:
Post a Comment