1 ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చి మూడు దినములైన తరువాత కైసరైయనుండి యెరూషలేముకు వెళ్లెను.
2 అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యలును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి.
3 మరియు త్రోవలో అతని చంపుటకు పొంచియుండి - మీరు దయచేసి అతని యోరూషలేముకు పిలువనంపించుడని అతనిమీద ఫేస్తునొద్ద మనవిచేసిరి.
4 అందుకు ఫేస్తు - పౌలు కైసరైయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్లబోవుచున్నాను
5 గనుక మీలో సమర్థులైనవారు నాతో కూడ వచ్చి, ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోప వచ్చునని ఉత్తరమిచ్చెను.
6 అతడు వారియొద్ద ఎనిమిది పది దినములు గడిపి కైసరైయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను.
7 పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన అనేక నేరములను మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి.
8 అందుకు పౌలు - యూదుల ధర్మశాస్త్రమునుగూర్చి గాని, దేవాలయమునుగూర్చి గాని, కైసరునుగూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదముచేయలేదని సమాధానము చెప్పెను.
9 అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని - యెరూషలేముకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులను గూర్చి విమర్శంపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.
10 అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడియున్నాను; నేను విమర్శంపబడవలసిన స్థలమిదే; యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును.
11 నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకానియెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.
12 అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత - కైసరు ఎదుట చెప్పుకొందువా? కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.
13 కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరైయకు వచ్చిరి.
14 వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా - ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన యొక ఖైది యున్నాడు.
15 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులను యూదుల పెద్దలను అతనిమీద తెచ్చిన ఫిర్యాదు సంగతి తెలియజేసి తనకి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.
16-17. అందుకు నేను - నేరము మోపబడినవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగావచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను (శిక్షకు) అప్పగించుట రోమీయుల ఆచారము కాదని వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని.
18 నేరము మోపినవారు నిలిచినప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతనిమీద మోపినవారు కారు.
19 అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;
20 ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమే యేలాగున విచారింపవలెనో యేమియుతోచక, యెరూషలేముకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగితిని.
21 అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపియుంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించువరకు నిలిపియుంచవలెనని ఆజ్ఞాపించితిననెను.
22 అందుకు అగ్రిప్ప - ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు - రేపు వినవచ్చునని చెప్పెను.
23 కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపదులతోను పట్టణమందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.
24 అప్పుడు ఫేస్తు - అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు - వీడు ఇక బ్రదుకతగడని కేకలువేయుచు అతనిమీద నాతో మనవిచేసికొనిరి.
25 ఇతడు మరణమునకు తగినది ఏమియుచేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనింనందున ఇతని పంప నిశ్చయించియున్నాను.
26 ఇతనిగూర్చి మన యేలినవారిపేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పరాజా, మఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించి యున్నాను.
27 ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుటయుక్తముకాదని నాకు తోచుచున్నదని చెప్పెను.
Download Audio File

No comments:
Post a Comment