1 ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజమందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులును హెల్లేనీయులును విశ్వసించిరి. 3
2 అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించిరి.
3 కాబట్టి వారు ప్రభవును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారిచేత సూచక క్రియలను మహత్కార్యములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను.
4 ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.
5 మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి.
6 వారాసంగతి తెలిసికొని లుకయోనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.
7-8. లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడవలేక కూర్చుండియుండువాడు.
9 అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరిచూచి, స్వత్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
10 - నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువసాగెను.
11-12. జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో - దేవతలు మనుష్యరూపముదాల్చి మనయొద్దకు దిగి వచ్చుచున్నారని కేకలువేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగియైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి.
13 పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతియొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెననియుండెను.
14 అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోకి చొరబడి
15 - అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
16 ఆయన గతకాలములలో సమస్త జనులను తమ మార్గములయందు నడువనిచ్చెను.
17 అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును ఫలవంతములైన రుతువులును దయచేయుచు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.
18 వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండ సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను.
19 అంతియొకైయనుండియు ఈకొనియనుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలపలికి అతనిని ఈడ్చిరి.
20 అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరిపోయెను.
21 వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులునుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకైయకును తిరిగి వచ్చి
22 శిష్యుల మనస్సులను దృఢపరచి - విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
23 మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థనచేసి, వారునమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి.
24 తరువాత పిసిదియదేశమంతట సంచరించి పంపులియకు వచ్చిరి
25 మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకువెళ్లిరి.
26 అక్కడనుండి ఓడయెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవునికృపకు అప్పగింపబడినవారై,
27 వారు వచ్చి సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి.
28 పిమ్మట వారు శిష్యులయొద్ద బహుకాలము గడిపిరి.
Download Audio File

No comments:
Post a Comment