Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

23వ అధ్యాయము

1  పౌలు మహా సభవారిని తేరిచూచి - సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగలవాడనై దేవుని యొదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. 
2  అందుకు ప్రధానయాజకుడైన అననీయ - అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపింపగా 
 3-4. పౌలు అతని చూచి - సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రముచొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు - నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా అని అడిగిరి. 
4  3-4. పౌలు అతని చూచి - సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రముచొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు - నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా అని అడిగిరి. 
5  అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు-నీ ప్రజల అధికారిని నిందింపవద్దుఅని వ్రాయబడియున్నదనెను. 1
6  వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి - సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; (మనకున్న) నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమునుగూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. 
7  అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. 
8  సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు. 
9  అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి - ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. 
10  కలహమెక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి - మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోకి తీసికొనిరండని రాణువవారికి ఆజ్ఞాపించెను. 
11  ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి - ధైర్యముగా ఉండుము; యెరూషలేములో నీవు నన్నుగూర్చి యేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్యమియ్యవలసియున్నదని చెప్పెను. 
12  ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని శపథము చేసికొనిరి. 
13  ఈ కుట్రలో చేరినవారు నలుబదిమందికంటె ఎక్కువైనవారు. 
14  వారు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును వచ్చి - మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని కఠినమైన శపథము చేసికొనియున్నాము. 
15  కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతని మీయొద్దకు తీసికొనిరమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి. 
16  అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. 
17  అప్పుడు పౌలు శతాధిపతులలో నొకని తనయొద్దకు పిలిచి - ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒకమాట చెప్పుకొనవలెనని యున్నాడనెను. 
18  శతాధిపతి సహస్రాధిపతి యొద్దకతని తోడుకొనిపోయి - ఖయిదీయైన పౌలు నన్ను పిలిచి - నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ చిన్నవాని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను. 
19  సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసికొనిపోయి - నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను. 
20  అందుకతడు - నీవు పౌలునుగూర్చి మరి పూర్తిగా విచారింపబోవునట్టు అతని రేపు మహాసభయొద్దకు తీసికొనిరావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు. 
21  వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని శపథముచేసికొని యున్నారు; ఇప్పుడు నీ యొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. 
22  అందుకు సహస్రాధిపతి - నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ చిన్నవాని పంపివేసెను. 
23  తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి - కైసరైయదాక వెళ్లుటకు ఇన్నూరుమంది రాణువవారిని డెబ్బదిమంది గుర్రపురౌతులను ఇన్నూరుమంది యీటెలవారిని రాత్రి తొమ్మిదిగంటలకు సిద్ధపరచి 
24  పౌలును ఎక్కించి - అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పెను. 
25  మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను - 
26  మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు. 
27  యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, రాణువతో వచ్చి అతని తప్పించితిని. 
28  వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతని తీసికొని వచ్చితిని. 
29  వారు తమ ధర్మశాస్త్రవాదములను గూర్చి అతనిమీద దోషారోపణ చేసిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు. 
30  అయితే వారు ఈ మునుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెననియున్న సంగతి నీయొదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. 
31  కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము రాణువవారు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొని పోయిరి. 
32  మరునాడు వారతనితో కూడ గుర్రపు రౌతులను వెళ్లనిచ్చి తాము కోటకు తిరిగి వచ్చిరి. 
33  వారు కైసరైయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియొదుట నిలువబెట్టిరి. 
34  అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు - ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని 
35  - నీమీద నేరము మోపువారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి, హేరోదు అధికారమందిరములో అతని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను. 
Download Audio File

No comments:

Post a Comment