1-2. వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి
3 వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.
4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదు వేలు ఆయెను.
5 మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
6 ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరును వారితోకూడ ఉండిరి.
7 వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి - మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీని చేసితిరని అడుగగా
8 పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను - ప్రజల అధికారులారా, పెద్దలారా,
9 ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొన వలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వాడు స్వస్థతపొందినవాడై మీ యెదుట నిలుచుచున్నాడు.
11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. 6
12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని, ఆకాశముక్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.
13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులనిగ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
14 స్వస్థతపొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
15 అప్పుడు - సభ వెలిపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలోతాము ఆలోచన చేసి
16 ఈ మనుష్యులను మనమేమి చేయుదుము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి ప్రత్యక్షమే; అది జరుగలేదని చెప్పజాలము.
17 అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుడుటకై - ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యునితో నైనను మాటలాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలెనని చెప్పుకొనిరి.
18 అప్పుడు వారిని పిలిపించి - మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి.
19 అందుకు పేతురును యోహానును వారిని చూచి - దేవుని మాటవినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టకి న్యాయమా? మీరే చెప్పుడి;
20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి.
21 ప్రజలందరు జరిగినదానిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి
22 స్వస్థపరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చెయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఏక్కువ వయస్సుగలవాడు.
23 వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటలనన్నిటిని వారికి తెలిపిరి.
24 వారు విని, యేకమనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. - నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
25 -అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి
26 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరిప్రభువు మీదను ఆయన క్రీస్తుమీదనుభూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరిఅని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదునోట పలికించితివి. 2
27-28. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతింపిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
29 ప్రభువా, ఈ సమయమున వారి బెదరింపులు చూచి
30 రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.
31 వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్నచోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
32 విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగినవాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.
33 ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమునకు సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.
34 భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మినవాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచువచ్చిరి.
35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి
37 దాని వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.
Download Audio File

No comments:
Post a Comment